మసూద్ మృతి పార్టీకి తీరని లోటు.

మసూద్ మృతి పార్టీకి తీరని లోటు.

* ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఆవేదన
* కొత్తగూడెంలో పలు కుటుంబాలకు పరామర్శ

ఖమ్మం బ్యూరో, జులై 17(తెలంగాణ ముచ్చట్లు )

మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు మసూద్ మరణం పార్టీకి, మైనారిటీ వర్గాలకు తీరని లోటు అని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఇటీవల ఎస్ కే. మసూద్ గుండె పోటుతో మరణించారు. ఈ రోజు వారి స్వగృహానికి వెళ్ళి మసూద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మసూద్ సతీమణి 54వ డివిజన్ కార్పొరేటర్ నళినీ జయంతి మసూద్  మరియు కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మసూద్ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ మసూద్ మరణం పార్టీకి, మైనారిటీ వర్గాలకు తీరని లోటు అని, మసూద్ దంపతులు ప్రజలకు చేసిన సేవలు మరువలేవని, మైనారిటీ వర్గాల కబరస్థాన్ స్థలం కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. 
* అనంతరం అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ నాయకులు సురేష్ ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రామవరంలో కరెంట్ షాక్ తో మరణించిన కాంగ్రెస్ యువ నాయకులు కళ్యాణ్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాబు క్యాంప్ నకు చెందిన అడేపు విజయ లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించారు. నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నాయకుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత, రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, కొత్వాల శ్రీనివాస రావు, మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్ర శేఖర్ రావు, జిల్లా అధికార ప్రతినిధి వై. శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా వైస్ ప్రెసిడెంట్ జానీ పాషా, మంద హనుమంత రావు,    కొదుమూరి శ్రీనివాస్ రావు,   జిల్లా జనరల్ సెక్రటరీ లు పెద్ద బాబు, నాగార్జున,  సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఐఎన్ టీఎంసీ నేత రజాక్,   యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, పట్టణ, మండల కాగ్రెస్ పార్టీ అధ్యక్షులు   పరమేష్ యాదవ్, దేవగడ్ల ప్రసాద్, జేమ్స్  సునీల్, భువన సుందర్ రెడ్డి, చింతలపూడి రాజ శేఖర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గడ్డల రమేష్,  కార్పొరేటర్లు, సర్పంచ్ లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.