రేపు వనపర్తికి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. విశారధన్ మహారాజ్.

రేపు వనపర్తికి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. విశారధన్ మహారాజ్.

వనపర్తి,జూలై14(తెలంగాణ ముచ్చట్లు):

ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్‌పీ) సంస్థాగత బలోపేతం, జిల్లా నూతన కమిటీ ఎన్నిక, పార్టీ విస్తరణతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా. విశారధన్ మహారాజ్ బుధవారం ఉదయం 11 గంటలకు వనపర్తికి రానున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలతో పాటు సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యాచరణ, రానున్న కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.ఈ సమావేశం వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల గేటు ఎదురుగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం పై అంతస్తులో ఉన్న ఎంఎన్‌ఆర్ బ్యాంక్వెట్ హాల్‌లో జరుగుతుందని తెలిపారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా నాయకులు విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు శాశ్వత గూడు. ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు శాశ్వత గూడు.
పెబ్బేరు,జూలై14(తెలంగాణ ముచ్చట్లు): పేద కుటుంబాల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెబ్బేరు...
అగ్నిప్రమాద బాధితురాలు రాధమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల సమస్యలు పరిష్కరించాలి.
సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు జమ్మికుంటలో నో ఎంట్రీ.. తనిఖీలు ముమ్మరం.
నూతన ఎంపీడీవోకు దేవస్థానం చైర్మన్ మర్యాదపూర్వక సన్మానం.
రేపు వనపర్తికి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. విశారధన్ మహారాజ్.
ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.