వెల్టూరులో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన తహసీల్దార్ మల్లికార్జున్.

వెల్టూరులో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన తహసీల్దార్ మల్లికార్జున్.

పెద్దమందడి,జూలై14(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని తహసీల్దార్ మల్లికార్జున్ మంగళవారం పరిశీలించారు. కార్యక్రమం నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని ఆదేశించారు.అనంతరం కార్యక్రమానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ప్రజలకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, సందేహాలకు వెంటనే సమాధానాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీ ఎల్ ఓ, బీ ఎల్ ఏ లు, బిజెపి రమేష్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు శాశ్వత గూడు. ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు శాశ్వత గూడు.
పెబ్బేరు,జూలై14(తెలంగాణ ముచ్చట్లు): పేద కుటుంబాల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెబ్బేరు...
అగ్నిప్రమాద బాధితురాలు రాధమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల సమస్యలు పరిష్కరించాలి.
సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు జమ్మికుంటలో నో ఎంట్రీ.. తనిఖీలు ముమ్మరం.
నూతన ఎంపీడీవోకు దేవస్థానం చైర్మన్ మర్యాదపూర్వక సన్మానం.
రేపు వనపర్తికి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. విశారధన్ మహారాజ్.
ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.