ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.

బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏ మధు.

ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.

పెద్దమందడి,జూలై14(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో నిర్వహించిన ఓటరు నమోదు సవరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏ మధు పాల్గొని ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు. ప్రతి ఓటరు తమ పేరు, ఫోటోతో పాటు ఇతర వివరాలు ఓటరు జాబితాలో సక్రమంగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి.ఓటరు నమోదు, వివరాల సవరణకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే గ్రామ బీఎల్‌వో లేదా బీఎల్‌ఏలను సంప్రదించి వాటిని సరిచేసుకోవాలి.18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య బలోపేతానికి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎ రఘువర్ధన్ రెడ్డి, వెంకటగిరి శ్యామ్, కానాపురం శీను పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు శాశ్వత గూడు. ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు శాశ్వత గూడు.
పెబ్బేరు,జూలై14(తెలంగాణ ముచ్చట్లు): పేద కుటుంబాల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెబ్బేరు...
అగ్నిప్రమాద బాధితురాలు రాధమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల సమస్యలు పరిష్కరించాలి.
సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు జమ్మికుంటలో నో ఎంట్రీ.. తనిఖీలు ముమ్మరం.
నూతన ఎంపీడీవోకు దేవస్థానం చైర్మన్ మర్యాదపూర్వక సన్మానం.
రేపు వనపర్తికి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. విశారధన్ మహారాజ్.
ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.