గోదావరి జలాలు అందించిన మంత్రి తుమ్మలకు రైతుల పాలాభిషేకం.
- కల్లూరు మండల రైతుల హర్షం.
- సాగునీటి కల సాకారం చేశారంటూ కృతజ్ఞతలు.
సత్తుపల్లి, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు):
సీతారామ ప్రాజెక్టు ద్వారా మోటార్లు ప్రారంభించి రాజీవ్ లింక్ కెనాల్ మార్గంగా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌తో పాటు నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందించిన సందర్భంగా కల్లూరు మండల రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాగునీటి కలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాకారం చేశారని కొనియాడారు. గోదావరి జలాలు తమ పొలాలకు చేరేలా కృషి చేసిన మంత్రికి రైతాంగం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. సాగునీరు అందడంతో పంటల సాగు విస్తరిస్తుందని, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా రైతులు స్వచ్ఛందంగా పాల్గొని పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.


Comments