తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి.

వనమహోత్సవంలో చైర్మన్ సందేశం.

తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి.

IMG-20260705-WA0012

జమ్మికుంట టౌన్ జులై 05 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్, ప్రతి పౌరుడు, ప్రతి మహిళ తమ నివాసాల వద్ద తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
"తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి" అని పేర్కొంటూ, పెరుగుతున్న జనాభాతో ఏర్పడుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే విస్తృతంగా మొక్కలు నాటడం అవసరమని అన్నారు. ఖాళీ ప్రదేశాలతో పాటు ప్రతి ఇంటి పరిసరాల్లోనూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలుగురి సురేష్, చందా రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్, బొళ్ల సదానందం, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సీఎల్‌ఆర్‌పీలు, ఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .