కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం.

కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం.

- కేటీఆర్‌కు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట టౌన్ జూలై 05 (తెలంగాణ ముచ్చట్లు):

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపుహౌజ్‌ను సందర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి కేటీఆర్‌కు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటిని అందించేలా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం నీటి నిల్వలు ఉన్నప్పటికీ పంపింగ్‌లో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను పరిశీలించేందుకు కేటీఆర్ కన్నెపల్లి పంపుహౌజ్‌ను సందర్శించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలుగురి సురేష్, చింతల శ్రీనివాస్, మంద రాజేష్‌తో పాటు హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .