జర్నలిస్ట్ జానీపాషా జన్మదినం సేవామయం.

జర్నలిస్ట్ జానీపాషా జన్మదినం సేవామయం.

-- ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ

--  టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుని పిలుపుతో ముందుకొచ్చిన జర్నలిస్టులు

ఖమ్మం బ్యూరో , జూన్ 22 (తెలంగాణ ముచ్చట్లు )

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా నాయకులు, సీనియర్ జర్నలిస్ట్, షేక్ జానీ పాషా జన్మదినోత్సవాన్ని  పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ పిలుపు మేరకు జర్నలిస్టులు, సంఘ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... జన్మదిన వేడుకలను కేవలం కేక్ కటింగ్‌కే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం మంచి సంప్రదాయమన్నారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి,  జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, 
అక్రిడీటేషన్ కమిటీ సభ్యురాలు మధుశ్రీ, ప్రముఖ యాంకర్ సిరి, యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి గరిడేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు సయ్యద్ అంజద్, కొరకొప్పుల రాంబాబు, ఇతర జర్నలిస్టు మిత్రులు పాల్గొని జానీ పాషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి . భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి .
ఖమ్మం బ్యూరో, జూన్ 22(తెలంగాణ ముచ్చట్లు ) యువత గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తి గత జీవితంతో పాటు...
రైతు మేళా, ముఖ్యమంత్రి సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి... 
జర్నలిస్ట్ జానీపాషా జన్మదినం సేవామయం.
అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు.
మృతుడి పిల్లల చదువులకు చేయూత.. రూ.1.36 లక్షల విద్యా సహాయ నిధి అందజేత.
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం .