ఇందిరమ్మ ఇళ్లలో ఆనంద దీపాలు.. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్.

ఇందిరమ్మ ఇళ్లలో ఆనంద దీపాలు.. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్.

- తొలి విడత ఇళ్లు 85 శాతం పూర్తి..
- అర్హులందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యం..

జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక మండలాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు, సీతంపేట గ్రామాలు, జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం 8వ వార్డు, వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామాల్లో జరిగిన గృహ ప్రవేశ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులను అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని తెలిపారు. తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించామని, రెండో విడతలో కూడా అదే విధానాన్ని కొనసాగించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 85 శాతం పూర్తయిందని వెల్లడించారు.

గృహ ప్రవేశాలకు వెళ్తున్న సమయంలో లబ్ధిదారుల కళ్లలో కనిపిస్తున్న ఆనందం ఎంతో సంతృప్తిని ఇస్తోందని ప్రణవ్ పేర్కొన్నారు. తమను స్వయంగా ఆహ్వానించి గృహ ప్రవేశాలకు పిలవడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం సిరిసేడు గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మతల్లి బోనాల పండుగలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమాల్లో గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయIMG-20260617-WA0101కులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .