శ్రీశైలంలో మోజర్ల, మద్దిగట్ల విద్యార్థుల కూచిపూడి ప్రదర్శన.

శ్రీశైలంలో మోజర్ల, మద్దిగట్ల విద్యార్థుల కూచిపూడి ప్రదర్శన.

పెద్దమందడి,జూన్(15తెలంగాణ ముచ్చట్లు):

శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి దివ్య సన్నిధిలో సాత్విక కూచిపూడి అకాడమీ అధినేత, నృత్య గురువు శ్రీమతి సుధారాణి శిష్య బృందం నయనానందకరంగా కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండల్ రావు నృత్య విశేషాలను తిలకించి గురుశిష్యులను ఘనంగా అభినందించారు.ఈ ప్రదర్శనలో కొత్తకోట, మోజర్ల, మద్దిగట్ల ప్రాంతాలకు చెందిన అకాడమీ విద్యార్థులు నక్షత్ర, వర్షిణి తదితరులు పాల్గొని తమ నృత్య ప్రతిభతో భక్తులను ముగ్ధులను చేశారు.కార్యక్రమంలో గట్టు వర్షిని, గట్టు శరత్, చంద్రిక, గట్టు తేజస్విని, గట్టు విదిగ్జా, గట్టు సమీక్ష దమయంతి, అఖిత, జ్యోత్స్న శ్రీ, లాస్య, రిషిత, హిమ వర్షిని తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో భక్తులు, ఆలయ అధికారులు పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు. శ్రీశైలం సన్నిధిలో జరిగిన ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవాల సమ్మేళనంగా నిలిచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .