వడదెబ్బతో మహిళ మృతి.
Views: 220
On
భీమదేవరపల్లి, మే 31 (తెలంగాణ ముచ్చట్లు):
భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన సమ్ము మంకమ్మ (65) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె, ఇటీవల తీవ్ర ఎండల ప్రభావంతో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మంకమ్మ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. మండలంలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments