సోదరభావానికి ప్రతీకగా హుజురాబాద్‌లో బక్రీద్ సంబరాలు.
Views: 5
On
హుజురాబాద్, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ పట్టణంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ఈద్గాలకు భారీగా తరలివచ్చిన ప్రజలు ప్రత్యేక నమాజ్ నిర్వహించి దేశం, రాష్ట్రంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థనలు చేశారు.
ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణమంతా పండుగ వాతావరణంతో కళకళలాడగా, మటన్ వంటలు, స్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు.
అదేవిధంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో యువకులు సేవా కార్యక్రమాలు నిర్వహించి మానవత్వాన్ని చాటారు. పేదలకు ఆహారం పంపిణీ చేయడం, అవసరమైన వారికి సహాయం అందించడం వంటి కార్యక్రమాలతో బక్రీద్ సంబరాలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments