బుద్వేష్‌చారికి ఉత్తమ 108 ఉద్యోగి అవార్డు.

బుద్వేష్‌చారికి ఉత్తమ 108 ఉద్యోగి అవార్డు.

వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పెద్దమందడి మండలానికి చెందిన 108 అత్యవసర సేవల ఉద్యోగి బుద్వేష్‌చారి ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు.అత్యవసర సమయాల్లో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందిస్తూ విధుల పట్ల అంకితభావం, బాధ్యతతో పనిచేసినందుకు ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చేతుల మీదుగా బుద్వేష్‌చారి అవార్డును అందుకున్నారు. కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ప్రజల ప్రాణాలను కాపాడటంలో అత్యవసర సేవల సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. అవార్డు అందుకోవడం పట్ల బుద్వేష్‌చారి సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ గుర్తింపు తనలో మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .