ఘనంగా ప్రణవ్ జన్మదిన వేడుకలు.

నియోజకవర్గ నలుమూలల సేవా కార్యక్రమాలు.

ఘనంగా ప్రణవ్ జన్మదిన వేడుకలు.

హుజురాబాద్,ఆగష్టు 15(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్, వీణవంక మండలాల్లో ప్రణవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, రైతు కూలీలకు చీరల పంపిణీ నిర్వహించారు. జమ్మికుంట పట్టణం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను వొడితల ప్రణవ్ సందర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో సుమారు నూటయాభై మంది రక్తదానం చేశారు.
జన్మదినం సందర్భంగా వొడితల ప్రణవ్ హుజురాబాద్ హనుమాన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వొడితల ప్రణవ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరింత అంకితభావంతో సేవ చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి, కౌన్సిలర్లు, దేవస్థానాల చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్, డైరెక్టర్లు, జిల్లా నాయకులు, పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యూత్, యువజన, ఎన్‌ఎస్‌యూఐ, మైనారిటీ, సేవాదళ్, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .