ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.

ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.

ఉప్పల్,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ ప్రెస్ క్లబ్‌కు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పూడూరు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీవీని అందజేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రెస్ క్లబ్ ప్రతినిధులకు టీవీని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సౌకర్యార్థం ఉప్పల్ ప్రెస్ క్లబ్‌కు టీవీ అందించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి సౌకర్యాల మెరుగుదలకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల తిరుపతిరెడ్డి,ప్రధాన కార్యదర్శి గ్యారంపల్లి శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పారేల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఏవి శ్రీధర్ రావు, కూకుట్ల నరోత్తం రెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ దాస రాజుతో పాటు సీనియర్ జర్నలిస్టులు దొంతుల వెంకటరామిరెడ్డి, కొలనుపాక చంద్రమౌళి, పల్లా మహేందర్ రెడ్డి, శ్రీశైలం,కోడికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.జర్నలిస్టుల సౌకర్యాల కోసం సహకారం అందించిన పూడూరు జితేందర్ రెడ్డికి, బీఆర్‌ఎస్ నాయకులకు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .