సత్తుపల్లిలో 6.36 కిలోల గంజాయి పట్టివేత.

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఇద్దరి అరెస్టు.

సత్తుపల్లిలో 6.36 కిలోల గంజాయి పట్టివేత.

సత్తుపల్లి, ఆగస్టు 14(తెలంగాణ ముచ్చట్లు): 

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 కిలోల 360 గ్రాముల గంజాయి, ఐ10 కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.3.12 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి ఆధ్వర్యంలో, ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఈగల్‌ టీమ్‌, పోలీస్‌ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఐ10 కారును తనిఖీ చేయగా 10 ప్యాకెట్లలో గంజాయి లభించింది.గంజాయి తరలిస్తూ పట్టుబడిన వారిలో ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా పొట్టంగి ప్రాంతానికి చెందిన కామేష్‌ మారి (27) డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మరో నిందితుడు కారా రాజేంద్ర (21) కూలీగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కామేష్‌ తండ్రి సింగురు మారి కాగా, రాజేంద్ర తండ్రి సిక్కును కూరగా పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారని పేర్కొన్నారు. ఇద్దరిపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను రాబట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి కొనుగోలు, విక్రయాలు, రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీహరి హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచి తగిన రివార్డు అందజేస్తామని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఎస్‌ఐ ప్రదీప్‌, ఈగల్‌ టీమ్‌ సిబ్బంది, సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా...
ప్రభుత్వానికి రూ.2.42 కోట్ల నష్టం.. రైస్ మిల్ యజమాని అరెస్ట్.
పోచమ్మ తల్లి ఆలయంలో బోరుబావికి శ్రీకారం.
పేదల సంక్షేమ పథకాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం.
విద్యారంగ సమస్యలపై యూఎస్పీసీ సమరభేరి.
సత్తుపల్లిలో 6.36 కిలోల గంజాయి పట్టివేత.
IIIT సీటు సాధించిన హాసినికి సర్పంచ్ ఆర్థిక సాయం.