దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల్లో మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.

దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల్లో మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.

వేలేరు, ఆగస్టు 1 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గమ్మ ఆలయం, పోచమ్మ ఆలయ ఆవరణల్లో నూతన మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిల్లా యాదగిరి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ నిధులతో ఈ మినీ వాటర్ ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే నాలుగు నెలల క్రితం ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో పోచమ్మ ఆలయం వరకు నూతన సీసీ రోడ్డు నిర్మించామని, గ్రామపంచాయతీ నిధులతో లైటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం ఆవరణలో సీసీ రోడ్డు కూడా మంజూరైందని తెలిపారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి వేలేరు గ్రామాన్ని జిల్లా స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, ఉపసర్పంచ్ శ్రీకర్, ఏఎంసీ డైరెక్టర్ సంపత్, వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ, సురేష్, సునీల్, సంధ్య, చైతన్యతో పాటు కాలనీ పెద్దలు సంపత్ రెడ్డి, రాజు, సురేష్, తిరుపతి, సదానందం, రాజశేఖర్, నరసయ్య, రంగం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

*అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. *అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
* ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు.. ఇంటర్ అర్హత కలిగిన స్థానిక మహిళలకు అవకాశం జమ్మికుంట టౌన్ ఆగస్టు 01 (తెలంగాణ ముచ్చట్లు):...
అర్హులైన ప్రతి ఓటరే లక్ష్యం.. క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన.
వీణవంకలో 'సర్' ఫారాల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తి.
దుర్గమ్మ, పోచమ్మ ఆలయాల్లో మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.
సత్తుపల్లిలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
ఫీల్డ్ అసిస్టెంట్లకు నిరసన కార్యక్రమాలతో సంబంధం లేదు.
వెల్టూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుల క్షేత్రస్థాయి పర్యటన.