యాత్ర విషాద బాధితులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి అండ.
మృతదేహం తరలింపు, క్షతగాత్రుల చికిత్సకు రూ.1.15 లక్షల సాయం.
వనపర్తి,జూలై21(తెలంగాణ ముచ్చట్లు):
తమిళనాడులో ఆధ్యాత్మిక యాత్ర సందర్భంగా సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వనపర్తి పట్టణానికి చెందిన చీర్ల శ్యామ్ సాగర్ (స్వామి) మృతి చెందగా, పలువురు గాయపడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. విషయం తెలుసుకున్న వెంటనే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు.ప్రమాదంలో గాయపడిన బాధితులను స్వస్థలానికి తరలించేందుకు, మృతదేహాన్ని వనపర్తికి తీసుకురావడానికి, క్షతగాత్రుల చికిత్సతో పాటు ఇతర అత్యవసర ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే మొత్తం రూ.1.15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే మేఘారెడ్డి, తీవ్ర విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయ సహకారాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఎమ్మెల్యే తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం అందించడంపై బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


Comments