గంజాయి రవాణా, విక్రయం,వినియోగంపై కఠిన చర్యలు .

ఏసీపీ టాస్క్ ఫోర్స్

గంజాయి తాగుతూ..పట్టుబడ్డ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్

ఖమ్మం బ్యూరో, జులై 15(తెలంగాణ ముచ్చట్లు )

జిల్లాలో గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణపై  దృష్టిసారించి రవాణా, విక్రయం, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్‌ కమిషనర్‌ సునీల్ దత్ ఆదేశించడంతో మంగళవారం టాస్క్ ఫోర్స్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ గంజాయి, డ్రగ్స్‌ రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం సేకరించి దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకోని చట్టపరమైన చర్యల నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్లలో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.  
ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట గంజాయి వినియోగిస్తూ... యువకులు పట్టుబడుతున్న నేపథ్యంలో దీనిపై పోలీస్ కమిషనర్ సీరియస్‌గా దృష్టిసారించారని, ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి దిగుమతి అవుతున్న మార్గాలతో పాటు వినియోగం ఎక్కువగా వుంటున్న ప్రాంతాలపై నిఘా వుంచాలని అన్ని పోలీస్‌ స్టేషన్ల అధికారులతో పాటు డ్రగ్స్‌ నియంత్రణకు ప్రత్యేకంగా నియమించిన బృందానికి పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. 
ఎవరైనా గంజాయి, మత్తుమందులతో పట్టుబడినా, వినియోగిస్తూ దొరికితే...వారిపై కేసులు నమోదుచేసి చేతులు దులిపేసుకోవడం కాకుండా వాటిని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు...ఎక్కడకు తీసుకువెళుతున్నారు...ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారనే సమాచారాన్ని సేకరించి మూలాలు వెలికితీస్తున్నట్లు తెలిపారు. 
అందులో భాగంగా నగరంలో రాత్రి ఇద్దరు యువకులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని మరో ఇద్దరు పారిపోయారని తెలిపారు. విచారణలో వారికి ఎక్కడి నుంచి గంజాయి వచ్చిందనే దానిపై ఆరాతీసినట్లు విచారించారు. గంజాయి సేవించిన వారితో పాటు మిగిలిన వారిపైనా  పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కేసులోనూ ఇదే తరహాలో వ్యవహరించడం ద్వారా గంజాయి, డ్రగ్స్‌ సరఫరా చైన్‌ను బ్రేక్‌ చేయవచ్చని ఏసీపీ టాస్క్ ఫోర్స్ పేర్కొన్నారు. ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నవరపేట వద్ద, ఎండు గంజాయి తాగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి, వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారయ్యారని చెప్పారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారించి, అతని వద్ద ఉన్న 40 గ్రాముల ఎండు గంజాయి ప్లాస్టిక్ సీసాలు, రోల్ పేపర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరుకూరి మామిడి తోట వద్ద, ఇద్దరు యువకులు గంజాయి తాగుతున్నట్లు గుర్తించి ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పారిపోయారాని, 5 గ్రాముల ఎండు గంజాయి, యాక్టివా ద్విచక్ర వాహనం, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.