ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
జమ్మికుంట టౌన్ జూలై 17 (తెలంగాణ ముచ్చట్లు):
హుజూరాబాద్ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని విలాసాగర్ గ్రామంలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన ఏడు సీసీ కెమెరాలను హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ, ఎస్సై ఎన్. రమేష్ సంయుక్తంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, నేరాల నియంత్రణ, అనుమానాస్పద కదలికల గుర్తింపు, ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి వీధిలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అరికట్టడంతో పాటు విచారణను వేగవంతం చేయవచ్చని వివరించారు.
సీసీ కెమెరాలు కేవలం నేరస్థులను గుర్తించడానికే కాకుండా ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో కూడా కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామాల భద్రతలో ప్రజలు భాగస్వాములై మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
గ్రామంలో ఆధునిక నిఘా వ్యవస్థ ఏర్పాటుతో భద్రత మరింత బలోపేతం అవుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


Comments