ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం..

ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం..

20వ వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు

20వ వార్డులో ఉచిత వైద్య శిబిరం..

ఖమ్మం బ్యూరో, జూలై 16(తెలంగాణ ముచ్చట్లు )

వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లయన్ ఐ కేర్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో వార్డుకు చెందిన ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. రక్తపోటు, మధుమేహం, జ్వరం, దగ్గు, జలుబు తదితర సీజనల్ వ్యాధులపై వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించి, తగిన జాగ్రత్తలు సూచించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నపాటి అనారోగ్య లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, స్వయంగా మందులు వాడకుండా నిపుణుల సలహా మేరకే చికిత్స తీసుకోవాలని అన్నారు.

ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి మందులు అందజేయడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా కీలకమని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎల్లప్పుడూ తమ వంతు కృషి కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్ ఐ కేర్ నిర్వాహకులు ఉండ్రు శ్యాంబాబు, వైద్య సిబ్బంది దుర్గా మల్లేశ్వరి, శ్రీలత, శృతి, సుగుణ, నవీనతో పాటు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.