ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.

కొమ్ము చెన్నకేశవులు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు .

ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.

వనపర్తి,జులై 05 (తెలంగాణ ముచ్చట్లు):

ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వనపర్తి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ పిలుపునిచ్చారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న గో టు విలేజెస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వనపర్తి పట్టణంలోని కర్రెమ్మ గుడి వద్ద మాదిగ కుల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణానికి స్థల సేకరణపై చర్చించారు.ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు గద్వాల కృష్ణ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ మాట్లాడుతూ, మాదిగల వర్గీకరణ అవసరాన్ని వివరించారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలపాటు సాగిన ఉద్యమ ఫలితంగానే వర్గీకరణ చట్టం సాధ్యమైందని పేర్కొన్నారు.వర్గీకరణ ద్వారా లభించే అవకాశాలను మాదిగ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య, ఉద్యోగాల్లో రాణించాలని సూచించారు.జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని, నూతన జెండా గద్దెలను నిర్మించి ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త గంధం గట్టయ్య మాదిగ నిర్వహించారు.కార్యక్రమంలో వీఎచ్‌పీఎస్ నాయకులు గంధం లక్ష్మయ్య, సుబ్రహ్మణ్యం, గంధం ఎల్లయ్య మాదిగ, ఆకులోర అంజి మాదిగ, ద్వారపోగు మద్దిలేటి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .