ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

జిల్లా మాజీ రైతుబంధు సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి.

ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

పెద్దమందడి,జూలై03(తెలంగాణ ముచ్చట్లు):

ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి నీళ్ల నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం వీరాయపల్లి, శేఖర్ చెట్టు తండా, ముందర తండా, దొడగుంటపల్లి, అల్వాల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించినట్లు జిల్లా మాజీ రైతుబంధు సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా గ్రామాల ప్రజలకు, ముఖ్య నాయకులకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించినట్లు ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలకు సంబంధించిన ఫారాలను పూర్తిగా నింపి వీలైనంత త్వరగా సంబంధిత బీఎల్‌ఓలకు అందజేసి, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు.ఓటరు జాబితా సవరణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా గ్రామస్థాయిలో నాయకులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించినట్లు జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే సంబంధిత బీఎల్‌ఓలతో సమావేశమై ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముందర తండా సర్పంచ్, అల్వాల గ్రామ సర్పంచ్, చిన్న మందడి నాగేంద్ర యాదవ్, దొడగుంటపల్లి సురేష్ కుమార్, అల్వాల వెంకట్ రెడ్డితో పాటు ఆయా గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నట్లు జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .