మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ .

మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ .

పూర్తిగా దూరంగా ఉండాలి – సమాచారం అందించిన వారి వివరాలు గోప్యమే

హుజూరాబాద్, జూన్ 25(తెలంగాణ ముచ్చట్లు ):

సమాజాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలంటే ప్రజల సహకారం అత్యంత కీలకమని హుజూరాబాద్ ఏసీపీ పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను నాశనం చేయడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల నిర్మూలనలో పోలీసు శాఖతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఏ ప్రాంతంలోనైనా మత్తు పదార్థాల విక్రయం, రవాణా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థుల్లో అవగాహన పెంచాలని సూచించారు. 
మత్తు పదార్థాల నియంత్రణలో పోలీసుల చర్యలతో పాటు ప్రజల అప్రమత్తత కూడా ఎంతో అవసరమని ఏసీపీ తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, యువజన సంఘాలు కలిసి మత్తు వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని కుటుంబ సభ్యులు, సమాజం, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .