బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన ఘనపూర్ కాంగ్రెస్.

బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన ఘనపూర్ కాంగ్రెస్.

ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చేసిన ఆరోపణలు నిరాధారమని మండల నాయకుల స్పష్టం

ఖిల్లా ఘనపూర్,జూన్23(తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఘనపూర్ మండల కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టారు. ఈ మేరకు మండల కేంద్రంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేఘారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రభుత్వం, ఎమ్మెల్యే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే నిరాధార విమర్శలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అభివృద్ధికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇస్తే ప్రభుత్వం సానుకూలంగా స్వీకరించి ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకుని ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.ఇదే విధమైన విమర్శలు కొనసాగిస్తే ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .