స్కూల్ జోన్‌లో పోలీసుల ఉక్కుపాదం.. పాన్, బెల్ట్ షాపులపై విస్తృత తనిఖీలు.

స్కూల్ జోన్‌లో పోలీసుల ఉక్కుపాదం.. పాన్, బెల్ట్ షాపులపై విస్తృత తనిఖీలు.

జమ్మికుంట టౌన్ జూన్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు, హుజూరాబాద్ ఏసీపీ పర్యవేక్షణలో జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న పాన్ షాపులు, బెల్ట్ షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల సందర్భంగా పాఠశాలల సమీపంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్కా, మత్తు పదార్థాలు లేదా ఇతర హానికర వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశాలను పోలీసులు పరిశీలించారు. విద్యార్థులకు హానికరమైన వస్తువుల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

పాఠశాలల పరిసరాల్లో వ్యాపారం నిర్వహించే దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యా వాతావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇలాంటి ప్రత్యేక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, ప్రజలు మరియు వ్యాపారులు పోలీసు శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.IMG-20260619-WA0128

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .