మద్దిగట్ల పాఠశాలలో వైభవంగా అక్షరాభ్యాసం.

మద్దిగట్ల పాఠశాలలో వైభవంగా అక్షరాభ్యాసం.

పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం  మద్దిగట్ల ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శివరాజ్, ఉపాధ్యాయులు రమేష్, విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి మంజులత, పాఠశాల సముదాయ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సరస్వతి మాత చిత్రపటానికి పూజలు నిర్వహించిన అనంతరం పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు పలకలు, బలపాలు అందజేసి అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ  మంజులత మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ..విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే పునాదిగా నిలుస్తుందని అన్నారు.ప్రధానోపాధ్యాయులు  శివరాజ్ పాఠశాలలో డిజిటల్ విద్యతో పాటు నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు తెలిపారు.అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి, చాక్లెట్లు అందజేశారు.కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .