గ్రామఅభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామసభలో చర్చ.

పామిరెడ్డిపల్లిలో గ్రామసభ నిర్వహణ.

గ్రామఅభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామసభలో చర్చ.

పెద్దమందడి,జూన్04(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రైతు వేదికలో గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో గ్రామాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ శాఖల పనితీరుపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ విద్య, వైద్యం, విద్యుత్, శిశు సంక్షేమం, మిషన్ భగీరథ తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై గ్రామసభలో క్లుప్తంగా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన ఇందిరా జీవిత బీమా, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, వితంతు, వృద్ధాప్య పెన్షన్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేయాలని గ్రామస్తులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాములమ్మ, వార్డు సభ్యులు నరేష్, కృష్ణ, యాదమ్మ, గ్రామసభ ప్రత్యేక అధికారి మంజులత, ఎంఈఓ, గ్రామ కార్యదర్శి స్రవంతి, నాయకులు భీమిరెడ్డి నాగేంద్ర, నరసింహ, రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .