జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.

జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.

జమ్మికుంట టౌన్ మే 24 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం రాష్ట్ర నాయకుల సమక్షంలో ఓటింగ్ విధానంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా మహమ్మద్ ముస్తఫా, ఉపాధ్యక్షునిగా ఎర్ర రాజు ఎన్నికయ్యారు. అలాగే సెక్రటరీగా దొడ్డే ఆంజనేయులు, కోశాధికారిగా సుంకరి రమేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, ఉపాధ్యక్షుడు ఎర్ర రాజు మాట్లాడుతూ జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా సంఘం ముందుండి పనిచేస్తుందని పేర్కొన్నారు.


IMG-20260524-WA0134

సభ్యుల ఐక్యతతో సంఘ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని, ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని నూతన కమిటీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సభ్యులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .