వేలేరు మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

వేలేరు మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

వేలేరు, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలేరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కోమి ఆధ్వర్యంలో, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ గీతాలాపనతో పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు.IMG-20260815-WA0006

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .