పామిరెడ్డిపల్లి పాఠశాలకు పూర్వ విద్యార్థి శాంతయ్య మైక్ సెట్ విరాళం.

పామిరెడ్డిపల్లి పాఠశాలకు పూర్వ విద్యార్థి శాంతయ్య మైక్ సెట్ విరాళం.

పెద్దమందడి,ఆగస్టు14(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి పానుగంటి శాంతయ్య మైక్ సెట్‌ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యాధికారి మంజులత మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు శాంతయ్య అందించిన సహాయం ప్రశంసనీయమని కొనియాడారు.గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నానని గుర్తు చేసుకుంటూ, పాఠశాలకు చేయూతన అందించిన శాంతయ్యను గ్రామం తరపున అభినందించారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ఆయన సహాయం పాఠశాల కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సి ఆర్ పి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ శాంతయ్య గొప్ప మనసుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.దాత పానుగంటి శాంతయ్య మాట్లాడుతూ.. 1991లో ఇదే పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసినట్లు గుర్తు చేసుకుంటూ, పాఠశాలకు తన వంతు సహాయం ఎప్పుడూ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీలు కృష్ణవేణి భాయి, కవిత, ఐఈడి లక్ష్మయ్య, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పూజిత, ఆయాలు కురువమ్మ, శారద తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా...
ప్రభుత్వానికి రూ.2.42 కోట్ల నష్టం.. రైస్ మిల్ యజమాని అరెస్ట్.
పోచమ్మ తల్లి ఆలయంలో బోరుబావికి శ్రీకారం.
పేదల సంక్షేమ పథకాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం.
విద్యారంగ సమస్యలపై యూఎస్పీసీ సమరభేరి.
సత్తుపల్లిలో 6.36 కిలోల గంజాయి పట్టివేత.
IIIT సీటు సాధించిన హాసినికి సర్పంచ్ ఆర్థిక సాయం.