పార్టీ విస్తరణపై తెలంగాణ రక్షణ సేన దృష్టి.

పార్టీ విస్తరణపై తెలంగాణ రక్షణ సేన దృష్టి.

ఇల్లంతకుంట, ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇల్లంతకుంట మండలంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఆదివారం పార్టీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గవ్యాప్తంగా పార్టీని మరింత విస్తరించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతను, ప్రజలను పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షిస్తూ గ్రామాల వారీగా సంస్థాగత బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఇల్లంతకుంటలో పార్టీ జెండా ఆవిష్కరణను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
స్థల పరిశీలన కార్యక్రమంలో హుజూరాబాద్ మండల నాయకులు పొన్నం శిరీష, దీటి రమేష్, బండ అశోక్, జమ్మికుంట నాయకుడు అంబాల హరీష్, ఇల్లంతకుంట మండల నాయకులు జంపాల రితేష్, గుండారపు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పరామర్శలతో ప్రజలకు అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
  బాధిత కుటుంబాలకు ఓదార్పు – ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా హుజురాబాద్,ఆగష్టు 2(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ సభలో రావుల వేణుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కితాబు.
స్నేహ బంధానికి ప్రపంచం వందనం.
వేంసూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం.
జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి.
భూ వివాదం ఉద్రిక్తం.. దంపతులపై దాడి జరిగిందని ఆరోపణ.