మరో వారం రోజుల్లో పెద్దమందడి–వనపర్తి రూ.40 కోట్ల రహదారి పనులు.

మరో వారం రోజుల్లో పెద్దమందడి–వనపర్తి రూ.40 కోట్ల రహదారి పనులు.

సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించం

-- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పెద్దమందడి,జూలై31(తెలంగాణ ముచ్చట్లు):

సాంకేతిక కారణాలతో జాప్యమైన పెద్దమందడి–వనపర్తి ప్రధాన రహదారి నిర్మాణ పనులు మరో వారం రోజుల్లో ప్రారంభమవుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు.శుక్రవారం పెద్దమందడి మండల రైతువేదికలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, వివిధ శాఖల పనితీరును సమీక్షించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.పెద్దమందడి–వనపర్తి రహదారి నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరైనప్పటికీ పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల మధ్య నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొంటూ, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.వ్యవసాయ శాఖ రైతులకు మరింత చేరువ కావాలని, యూరియా బుకింగ్ సమయంలో యాప్‌లో ‘నో స్టాక్’ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు, సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు మట్టి, ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల రుణాల మంజూరులో జాప్యంపై ఏపీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.నియోజకవర్గంలో గత 30 నెలల్లో విద్యుత్ శాఖ ద్వారా రూ.140 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, మరో రూ.40 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల ఫిర్యాదులపై లైన్‌మెన్‌లు వెంటనే స్పందించాలని ఆదేశించారు. పనిచేయని వీధిలైట్లను తక్షణమే మరమ్మతు చేయాలని, నిర్లక్ష్యం వహించే గ్రామపంచాయతీలపై చర్యలు తీసుకోవాలని సూచించారు.నీటి సంరక్షణకు ఉపయోగపడే ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల అందింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.భూభారతి ద్వారా భూ సమస్యలకు దశలవారీగా పరిష్కారం లభిస్తుందని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వారం రోజుల్లో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అధికారులు కూడా అదే నిబద్ధతతో పనిచేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు నవనీత, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి విజయభాస్కర్, జడ్పీ సీఈఓ యాదయ్య, ఎంఈఓ మంజుల, ఎంపీడీవో పరిణత, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.
* డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన...
77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.
తరాలను తీర్చిదిద్దిన గురువుకు ఘన వందనం.
శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.
గ్రామీణుల ఆరోగ్యానికి బాలవికాస చేయూత.
ఐదవ వార్డులో విస్తృతంగా మొక్కల పంపిణీ.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.