77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.

మల్లారెడ్డిపల్లిలో అమ్మ ఫౌండేషన్ ఆదర్శం.

77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.

వీణవంక, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):

వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో గత 77 శుక్రవారాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం శుక్రవారం 77వ వారంలోనూ భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాటిపెల్లి అజయ్ 25వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన తల్లి తాటిపెల్లి హేమలతతో పాటు కుటుంబ సభ్యులు పల్లేర్ల భాగ్యలక్ష్మి, పల్లేర్ల మురళి, వాణి, సాయి భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి అధ్యక్షుడు, టీపీసీసీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. పేపర్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులకు బదులుగా మోదుగాకుల విస్తార్లలో భోజనం వడ్డిస్తూ పర్యావరణ హిత విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గణేష్ కళాబృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే దాతలు, భక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కర్రె స్వామి, నిమ్మల మల్లన్న, ఈసంపెల్లి సాయికుమార్, దూలం వెంకటేష్, నిమ్మల రమేశ్, 9వ వార్డు సభ్యుడు గంధం ప్రశాంత్, దూలం సురేష్, కొలిపాక ఎల్లయ్య, అమ్మ ఫౌండేషన్ సభ్యులు కాంతాల సంపత్ రెడ్డి, కర్రె వెంకటస్వామి, ఆలయ పూజారి నిమ్మల సదయ్య, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. జమ్మికుంట అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. 38 కీలక తీర్మానాలకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం.
* డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన...
77 వారాలుగా నిరంతర అన్నప్రసాద సేవ.
తరాలను తీర్చిదిద్దిన గురువుకు ఘన వందనం.
శ్రీ మడేలేశ్వరస్వామి బోనాలకు ఘన శ్రీకారం.
గ్రామీణుల ఆరోగ్యానికి బాలవికాస చేయూత.
ఐదవ వార్డులో విస్తృతంగా మొక్కల పంపిణీ.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.