కుమారికి కన్నీటి వీడ్కోలు.. పూలమాల వేసి.
నివాళులర్పించిన చైర్‌పర్సన్ సుహాసిని.
Views: 0
On
హుజురాబాద్, జూలై 31(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణానికి చెందిన ట్రాన్స్‌జెండర్ క్రీ.శే. రొంటాల కుమారి మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం నిర్వహించిన ఆమె అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ట్రాన్స్‌జెండర్ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కుమారికి తుది వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్‌రావు పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బోరాగాల మొగిలి, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు, ట్రాన్స్‌జెండర్ సంఘసభ్యులు తదితరులు పాల్గొని క్రీ.శే. రొంటాల కుమారికి ఘన నివాళులర్పించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
31 Jul 2026 20:55:31
* డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్
జమ్మికుంట, జూలై 31 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన...


Comments