గురువే దైవం.. గురు పౌర్ణమి సందర్భంగా గురువులకు విశిష్ట సత్కారం.

గురువే దైవం.. గురు పౌర్ణమి సందర్భంగా గురువులకు విశిష్ట సత్కారం.

భీమదేవరపల్లి, జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):

గురు పౌర్ణమి (వ్యాస పౌర్ణమి) సందర్భంగా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని శ్రీ విశ్వేశ్వర ఆలయంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు రిటైర్డ్ ఉపాధ్యాయులు మన్మోహన్ రెడ్డి, తారాబాయి, కోడూరు సరోజన, లక్ష్మయ్య, పీ.ఈ.టీ శ్రీ రాజిరెడ్డి, బండారి రత్నాకర్ దంపతులు, గద్ద కొమురన్న సతీమణితో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గురువులను సన్మానించుకోవడం తమకు ఎంతో ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. గురువుల ఆశీస్సులతో సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన గురువులకు, వారి కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కాసాగోని భగత్ సింగ్‌తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి. వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి.
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...
గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి.
నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి.
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి : మంత్రి పొంగులేటి.
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సత్కారం.
రాహుల్ గాంధీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు.