పాత్రికేయుడు కోడిక్యాల సురేష్ కుటుంబానికి పరామర్శ...
అనంతరం స్మశానవాటికలో సమస్యలపై ఆరా.
హుజురాబాద్, జూలై 20(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసినీ సోమవారం ఈనాడు పాత్రికేయుడు కోడిక్యాల సురేష్ నివాసానికి వెళ్లి, ఇటీవల మృతి చెందిన ఆయన తల్లి లక్ష్మీదేవి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ భారతి బాలాజీ పాల్గొన్నారు.
అనంతరం చైర్‌పర్సన్ పట్టణంలోని స్మశానవాటికను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై అధికారులతో చర్చించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ సొల్లు సునీత బాబు, సెంట్రీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ వినయ్మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments