సీడ్ ప్లాంట్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి.

రైతుల బకాయిలు వెంటనే చెల్లించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు.

సీడ్ ప్లాంట్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి.

హుజురాబాద్,జులై 18(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని ఆర్థికంగా దోపిడీ చేస్తున్న సీడ్ ప్లాంట్ల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, రైతులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ కే. చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతులు పెద్ద ఎత్తున వరి విత్తనాలు ఉత్పత్తి చేసి సీడ్ ప్లాంట్లకు విక్రయిస్తున్నారని, యాసంగి సీజన్‌కు ముందే ధరలు నిర్ణయించి రైతులతో ఒప్పందాలు కుదుర్చుకున్న సీడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, పంట చేతికి వచ్చిన తర్వాత ఆ ఒప్పందాలను ఉల్లంఘించి రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. 2025లో కుదుర్చుకున్న ఒప్పందాలను పక్కనపెట్టి, 2026లో కొత్త ఒప్పందాల పేరుతో ధరలు తగ్గించి రైతులను తీవ్రంగా నష్టపరిచారని విమర్శించారు.
తరుగు, తూకం పేరుతో ప్రతి ఏడాది రైతుల నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్న సీడ్ ప్లాంట్ల యజమానులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించాలని రైతులు అడిగితే అవమానిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
అదే సమావేశంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్య, వైద్య రంగాల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, రైతులకు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కోరారు.
వ్యవసాయ శాఖ గతంలో ప్రకటించిన 33 రకాల వరి వంగడాలకు బోనస్‌ను యథావిధిగా కొనసాగించాలని, వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు చివరి వరకు గ్రామాల్లో సభలు, సమావేశాలు, చర్చాగోష్టులు నిర్వహిస్తామని తెలిపారు.
సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్, మండల కమిటీ సభ్యులు ప్రతాప్ శ్రీనివాస్, కొంకటి చంద్రయ్య, ఇమ్మడి దేవేందర్, అజ్జు, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు విలువను నేర్పిన శస్త్ర పబ్లిక్ స్కూల్. ఓటు విలువను నేర్పిన శస్త్ర పబ్లిక్ స్కూల్.
హుజూరాబాద్, జూలై 18(తెలంగాణ ముచ్చట్లు ): హుజూరాబాద్ పట్టణంలోని శస్త్ర పబ్లిక్ స్కూల్‌లో శనివారం హౌస్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించారు. కరస్పాండెంట్ వేణుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన...
సీడ్ ప్లాంట్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.