బీజేపీ బలోపేతమే లక్ష్యం.. రాష్ట్ర నాయకత్వంతో రాజేష్ ఠాకూర్.
జమ్మికుంట టౌన్ జులై 16 (తెలంగాణ ముచ్చట్లు):
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో జమ్మికుంట పట్టణానికి చెందిన బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు రాజేష్ ఠాకూర్ పాల్గొని పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన కార్యాచరణపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతి కుమార్‌ను రాజేష్ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిసి కరీంనగర్ జిల్లాలో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, క్షేత్రస్థాయిలో చేపడుతున్న సంస్థాగత కార్యకలాపాలపై వివరించారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలను నాయకులు అభినందిస్తూ, గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరిన్ని అభివృద్ధి నిధులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్ఠం చేయడం, యువత, మహిళలు, ఎస్సీ వర్గాల భాగస్వామ్యాన్ని పెంచడం, కేంద్ర ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సేవలు కొనసాగిస్తామని రాజేష్ ఠాకూర్ తెలిపారు.


Comments