కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ఫైర్.. ఘనపూర్ అభివృద్ధి శూన్యమని విమర్శ.

కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ఫైర్.. ఘనపూర్ అభివృద్ధి శూన్యమని విమర్శ.

వేలేరు, జూలై 16 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలంలోని మల్లికుదుర్ల, పీచర గ్రామాల్లో ఓటరు జాబితా పరిశీలనలో భాగంగా బీఎల్‌వోలతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని, అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. ఘనపూర్‌కు అన్యాయం చేశారని విమర్శిస్తూ, కడియం శ్రీహరికి రాజకీయ సమాధి కట్టాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చినట్లు తెలిపారు.
జూలై 1లోపు వేలేరు మండలంలోని మద్దెలగూడెం, పీచర, శాలపల్లి సహా పలు గ్రామాలకు నీళ్లు అందిస్తామని చెప్పి ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో "కడియం మార్క్" పేరుతో చెప్పుకునే అభివృద్ధి ఏదీ లేదని, ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమం లో వేలేరు మండల కన్వీనర్ కోయ్యడ మహేందర్, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి మారబోయిన రాజు, గోళ్లేనా రమేష్, సోమిరెడ్డి, విజేందర్ రెడ్డి, భూపతి రాజు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.