హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా ఆదరి రవీందర్ నియామకం.

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా ఆదరి రవీందర్ నియామకం.

భీమదేవరపల్లి, జూన్ 23(తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఆదరి రవీందర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఆయన నియామక ఉత్తర్వులను అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదరి రవీందర్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ సిద్ధాంతాల ప్రచారానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .