స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకం.
పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితి కళావేదిక అధ్యక్షులు .
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలు, వారి త్యాగాలు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రేడియంట్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల బానిస సంకెళ్లను తెంచేందుకు స్వాతంత్ర్య సమరయోధులు ప్రదర్శించిన పోరాట పటిమ, ధైర్యసాహసాలు, దేశభక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు.విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి కోసం బాధ్యతాయుత పౌరులుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కౌసల్య భాస్కర్, ప్రిన్సిపాల్ ఉప్పరి తిరుమలేష్, వైస్ ప్రిన్సిపాల్ బి. రాము, ఉపాధ్యాయులు రాహుల్, శాంతయ్య, రవి, శ్రీనివాస్, అఖిల్, మల్లేష్, ఖదిరున్నిసా, రామేశ్వరి, గీత, రజిత, శ్వేత, సరోజ, సాత్విక, జరీనా, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments