ఆరోగ్యవంతమైన బాల్యానికి నులిపురుగుల నివారణ కీలకం.
పెద్దమందడి,జూలై13(తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చిన్నారులకు నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. నులిపురుగుల నివారణ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పాటు లభిస్తుందని తెలిపారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, ఏఎన్‌ఎం తారాదేవి, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ప్రతి చిన్నారి ఆరోగ్యవంతంగా ఎదగాలంటే నులిపురుగుల నివారణకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.


Comments