వంగర గ్రామంలో బావిలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం కలకలం.

వంగర గ్రామంలో బావిలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం కలకలం.

భీమదేవరపల్లి, జూలై 7(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ బావిలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమవడంతో గ్రామంలో కలకలం రేగింది.

స్థానికులు బావిలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఆమె గుర్తింపు కోసం ప్రయత్నాలు చేపట్టడంతో పాటు, మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .