అందమైన చేతిరాతతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.

-- పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు 

అందమైన చేతిరాతతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.

వనపర్తి,జులై 07(తెలంగాణ ముచ్చట్లు):

విద్యార్థుల అందమైన చేతిరాత వారి భావి జీవితంపై సానుకూల ప్రభావం చూపడంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంపొందిస్తుందని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు, న్యూ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో తరుణ్ మాస్టర్ నిర్వహించిన ఒకరోజు ఉచిత చేతిరాత శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ..చక్కని చేతిరాత విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రత, తప్పులు లేకుండా రాసే అలవాటును పెంపొందిస్తుందని తెలిపారు. అందమైన చేతిరాత విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంలోనే కాకుండా ఉపాధ్యాయుల ప్రశంసలు పొందేందుకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.విద్యార్థుల్లో చేతిరాతపై ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, చేతిరాత శిక్షణ నిపుణుడు తరుణ్ మాస్టర్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.అనంతరం పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు కలిసి తరుణ్ మాస్టర్‌ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో చేతిరాత శిక్షణ నిపుణుడు తరుణ్ మాస్టర్, సహాయకురాలు మీనా, ఉపాధ్యాయులు రవికుమార్, అరవింద్, విజయ్‌కుమార్, రుక్ముద్దీన్, రంగనాయకమ్మ, నాగరాజు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .