వ్యవసాయ సాగు సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలి: పుల్లూరి స్వప్న సదానందం.

వ్యవసాయ సాగు సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలి: పుల్లూరి స్వప్న సదానందం.

జమ్మికుంట టౌన్ జూలై 07 (తెలంగాణ ముచ్చట్లు): 

ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం సూచించారు.
ప్రభుత్వ అనుమతి పొందిన ఎరువుల దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా కొనుగోలు బిల్లులను భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఎరువుల దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిర్ణీత ధరలకే ఎరువులను విక్రయించాలని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దుకాణాల్లో ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించి, తగిన నిల్వలను ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. రైతులు, వ్యాపారులు పరస్పర సహకారంతో ఈ వ్యవసాయ సీజన్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .