రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. అధికారుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి.

నాగేంద్ర యాదవ్, జిల్లా గొర్రెల సంఘం మాజీ డైరెక్టర్.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. అధికారుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి.

పెద్దమందడి,జులై06(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని ముందరి తండా నుంచి చిన్న మందడి గ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్న మందడి గ్రామానికి చెందిన జనిగే కురుమూర్తి (36) మృతి చెందడం అత్యంత విషాదకరమని జిల్లా గొర్రెల సంఘం మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు నాగేంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ముందరి తండా–చిన్న మందడి రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని, అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటి వరకు మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని ఆయన అన్నారు.ఈ రహదారి దుస్థితిపై పలుమార్లు వార్తాపత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికీ సంబంధిత అధికారుల్లో ఎలాంటి స్పందన కనిపించలేదని నాగేంద్ర యాదవ్ విమర్శించారు.అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే అధ్వాన్నంగా మారిన రహదారిపై బైక్ అదుపుతప్పి కురుమూర్తి  ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ముందరి తండా–చిన్న మందడి రహదారికి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నాగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా రహదారుల మరమ్మత్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నెలలుగా మూతపడిన ఆర్టీసీ కార్గో కేంద్రం. నెలలుగా మూతపడిన ఆర్టీసీ కార్గో కేంద్రం.
హుజురాబాద్, జూలై 5 (తెలంగాణ ముచ్చట్లు):  నియోజకవర్గ కేంద్రంగా, వరంగల్–కరీంనగర్ ప్రధాన రహదారిపై కీలక పట్టణంగా ఉన్న హుజురాబాద్‌లో తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు గత కొన్ని...
కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం.
నరాల ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.
తల్లి జన్మనిస్తే.. మొక్కలు పునర్జన్మ ఇస్తాయి.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. అధికారుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి.
హైవే దిగి తప్పించుకోవాలనుకున్నారు... సత్తుపల్లిలో చిక్కారు..