వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా లక్ష్మణ్ నాయక్.

బాధ్యతలు – పార్టీ బలోపేతమే లక్ష్యమని వెల్లడి.

వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా లక్ష్మణ్ నాయక్.

వేలేరు, జులై 03 (తెలంగాణ ముచ్చట్లు):

 వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన లక్ష్మణ్ నాయక్, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగల వెంకటరామిరెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతి కార్యకర్తను సమానంగా గౌరవించి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని లక్ష్మణ్ నాయక్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వేలేరు గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ మల్లన్న, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అనుదీప్, కరుణాకర్, అనిల్ తదితరులు పాల్గొని లక్ష్మణ్ నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .