కొనిజర్ల 108 సేవలపై ఉన్నతాధికారుల తనిఖీ.

కొనిజర్ల 108 సేవలపై ఉన్నతాధికారుల తనిఖీ.

- అంబులెన్స్‌లోని పరికరాల పనితీరుపై ఆరా.
- ఈఎంటీ, పైలెట్ సేవలకు ప్రశంసలు.

సత్తుపల్లి, జూన్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ఆరోగ్యశాఖ–కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి హైదరాబాద్‌ నుంచి వచ్చిన బ్రహ్మానందరావు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఆదివారం ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించింది. ఈ సందర్భంగా కొనిజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 108 అత్యవసర అంబులెన్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసింది. అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న అత్యవసర వైద్య పరికరాల పనితీరు, వాటి నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ, అత్యవసర సేవల అందజేత తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందేలా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. తనిఖీ సందర్భంగా జిల్లా వైద్యశాఖ అధికారులు, 108 ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్ పాల్గొన్నారు. విధుల్లో ఉన్న ఈఎంటీ కొమ్ము వెంకటేష్, అంబులెన్స్ పైలెట్ బోరిమల రామారావు విధి నిర్వహణను బ్రహ్మానందరావు అభినందించారు. అంబులెన్స్‌లోని పరికరాల నిర్వహణ, సేవల ప్రమాణాలపై బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .