గిరిజన బాలికల వసతి గృహంలో కొండచిలువ కలకలం!

గిరిజన బాలికల వసతి గృహంలో కొండచిలువ కలకలం!

- సత్తుపల్లిలో ఘటన.
- సురక్షితంగా పట్టుకున్న రిటైర్డ్ అటవీ శాఖ అధికారి.

సత్తుపల్లి, జూన్ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి గిరిజన బాలికల వసతి గృహంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై విద్యార్థినులను భయాందోళనకు గురిచేసింది. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ వసతి గృహంలోకి చొరబడినట్లు తెలిసింది. వేసవి సెలవులు కొనసాగుతుండటంతో ఎక్కువ మంది విద్యార్థినులు హాస్టల్‌లో లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. బీఈడీ పరీక్షల కోసం వసతి గృహంలో ఉన్న ఇద్దరు విద్యార్థినులు కొండచిలువను గుర్తించి భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రిటైర్డ్ అటవీ శాఖ బీట్ అధికారి ఎం.డి. మమ్మూద్ ఘటనాస్థలికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటనతో కొంతసేపు వసతి గృహంలో కలకలం నెలకొనగా, కొండచిలువను సురక్షితంగా తొలగించడంతో విద్యార్థినులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .